టీజీ నాబ్ అపరేషన్ "పారా"తో.. నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ ముఠాలు పరేషాన్..

by Bhanu |

తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో గోవాలో విదేశి డ్రగ్స్ డెన్ లను జల్లెడ పట్టింది. గోవాలో నెల రోజుల పాటు మాటు వేసి తెలంగాణ కు డ్రగ్స్ ను రాకుండా చేసేందుకు అత్యంత ప్రమాదకర స్థాయిలో టీజీ నాబ్ అధికారులు స్పెషల్ అపరేషన్ చేశారు.

టీజీ నాబ్ అపరేషన్ పారాతో.. నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ ముఠాలు పరేషాన్..
X

దిశ, సిటీక్రైం : తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో గోవాలో విదేశి డ్రగ్స్ డెన్ లను జల్లెడ పట్టింది. గోవాలో నెల రోజుల పాటు మాటు వేసి తెలంగాణ కు డ్రగ్స్ ను రాకుండా చేసేందుకు అత్యంత ప్రమాదకర స్థాయిలో టీజీ నాబ్ అధికారులు స్పెషల్ అపరేషన్ చేశారు. దీంతో గోవా నుంచి హైదరాబాద్ కు విదేశి ముఠాల నుంచి వస్తున్న నాలుగు ప్రాంతాల్లోని డ్రగ్స్ డెన్ లను టీజీ నాబ్ వెలుగులోకి తీసుకువచ్చింది. దీని కోసం టీజీ నాబ్ అధికారులు ప్రత్యేకంగా గోవా డీజీపీ , ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి, సమావేశమయ్యి సమన్వయంతో అపరేషన్ లను నిర్వహించి నైజీరియా దేశానికి చెందిన కొందరు అక్రమంగా వచ్చి డ్రగ్స్ డెన్ లను నడిపిస్తున్న గుట్టును బయటపెట్టింది.


గోవా నుంచి హైదరాబాద్ కు ఈ నైజీరియా దేశానికి చెందిన వారి నెట్ వర్క్ లో ఉన్న మొత్తం 40 మంది చైన్ ను టీజీ నాబ్ అధికారులు పట్టేశారు. ఈ చైన్ లో ఉన్న అందరీ పై నజర్ పెట్టి అందులో కీలకంగా ఉన్న వారందరీని అదుపులోకి తీసుకుని జైలుకు పంపింది. ఈ స్పెషల్ అపరేషన్ లో నైజీరియా దేశానికి చెందిన ముఠాలు చేస్తున్న డ్రగ్స్ దందాతో వస్తున్న ఆదాయాన్ని వారు హవాలా ద్వారా ఏలా అపరేట్ చేస్తున్నారనే ప్రక్రీయను కూడా రహస్యంగా వారిని నీడలా వెంటాడి మొత్తం హవాలా దందాను వెలుగులోకి తీసుకువచ్చింది. టీజీ నాబ్ స్పెషల్ అపరేషన్ తో ఇప్పుడు గోవాలో విదేశి డ్రగ్స్ గ్యాంగ్ లతో పాటు హవాలా దందా చేసే వారిలో వణుకును పుట్టించింది.

కానిస్టెబుల్ ఇచ్చిన క్లూతో గోవాలో అరేషన్ "పారా"

2018 సంవత్సరంలో నైజీరియా దేశానికి చెందిన లివియో హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తు 100 గ్రాముల కొకైన్ తో పట్టుబడ్డాడు. 1024/2018. ఈ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్న లివియో డ్రగ్స్ తో వస్తున్నాడని కానిస్టెబుల్ కు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని టీజీ నాబ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో టాజీ నాబ్ అధికారులు లివియో వ్యవహారం పై ఓ నజర్ పెట్టారు. తదుపరి కోర్టు విచారణ తేది నాడు వచ్చినప్పుడు లివియోను అదుపులోకి తీసుకుని సోదాలు జరుపగా అతని వద్ద కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ దొరికింది. అదే విధంగా అతను హైదరాబాద్ లో సంపన్న వర్గాల వారికి సరఫరా చేసి సంపాదించిన 2 లక్షల రూపాయాల నగదు లావాదేవిల చిట్టాను గుర్తించారు. లివియోను మరింత లోతుగా విచారించగా మొత్తం 40 మంది డ్రగ్స్ సరఫరాదారుల నెట్ వర్క్ గురించి టీజీ నాబ్ అధికారులకు తెలిసింది. ఈ 40 మంది గోవా లోని పారా, కలంగ్ గట్ట్, సియోలిమ్, అంజున ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను తీసుకుని వాటిని హైదరాబాద్, బెంగళూరు, కేరళకు సరఫరా చేస్తున్నట్లు టీజీ నాబ్ అధికారులు పసిగట్టారు.


ఈ నెట్ వర్క్ ను ఆరా తీయగా డిజే స్వాదీప్ సమాచారం పోలీసులకు లభించింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని సాంక్చరీ పబ్ లో డిజే కే ఉన్న స్వాదీప్ సంపన్న వర్గాలకు చెందిన చాలా మందిని డ్రగ్స్ కు బానిసలుగా చేసినట్లు టీజీ నాబ్ విచారణలో తేలింది. అతనిని అదుపులోకి తీసుకుని అతనితో గోవా నుంచి టచ్ లో ఉన్న చాలా మంది డ్రగ్స్ సరఫరా చేసే వారిని అదుపులోకి తీసుకుని ఈ చైన్ డ్రగ్స్ సప్లైకి బ్రేక్ వేశారు. అదే విధంగా ఇటీవల గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకువచ్చి హైదరాబాద్ లో సంపన్నులకు అందిస్తున్న బాలక్రిష్ణను కూడా అరెస్టు చేయడంతో అతని లింక్ కూడా గోవాకు చేరింది. దీంతో టీజీ నాబ్ కు చెందిన గ్రౌండ్ టీం నెల రోజుల పాటు మాటు వేసి గోవా పారా ప్రాంతంలో రెక్కీ నిర్వహించింది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మరో కీలక టీం చివరగా రెక్కీ చేసి గోవా డీజీపీ సహాకారంతో స్థానిక పోలీసులను సహాయం తీసుకుని నలుగురు నైజీరియన్ లను అరెస్టు చేసి 1.62 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.

డ్రగ్స్ దందా 2 రోజుల కలెక్షన్ 50 లక్షలు

అపరేషన్ పారా తో డ్రగ్స్ ముఠాల కీలకమైన వారిని అరెస్టు చేసి విచారిస్తున్నప్పుడు డ్రగ్స్ ను విక్రయిస్తున్న నైజీరియా దేశానికి చెందిన ముఠాలు సంపాదించిన డబ్బును హవాలా మార్గం ద్వారా వారి దేశాలకు పంపిస్తున్నట్లు టీజీ నాబ్ అధికారులు తెలుసుకున్నారు. దీంతో జూన 1వ తేది నుంచి 3 రోజుల పాటు మరో అపరేషన్ ను నిర్వహించారు. ప్రత్యేక బ్రుందాలు గోవాలోని హ-ల్యాండ్ అపార్ట్ మెంట్ ,మపూస ప్రాంతంలోని సంగీత మొబైల్ షాప్ వద్ద రౌండ్ థి క్లాక్ మాటు వేశారు. ఇలా 2 రోజుల పాటు వారిని కవర్ చేస్తు టీజీ నాబ్ నీడలా తిరిగారు. చివరకు 2 రోజుల కలెక్షన్ 50 లక్షలు చేసుకుని వాటిని నైజీరియాకు పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలో సోదాలు జరిపి ఈ హవాలా రాకేట్ కు చెందిన వారిని అరెస్టు చేశారు. సోదాల సమయంలో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు హవాలా వ్యాపారులు డ్రగ్స్ ముఠాల నుంచి వచ్చిన నగదును వాషింగ్ మెషీన్ లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

రూ.5, 10, 20 నోట్ చూపిస్తే నైజీరియాలో డబ్బులు

ఇలా డ్రగ్స్ కు సంబంధించిన నగదును గోవాలో ఉంటున్న ముఠాలు వాహలా ద్వారా నగదును మారుస్తారు. దీనికోసం రూ. 5, 10, 20 నోటును వాట్సాప్ లో నైజీరియాలో ఉన్న కింగ్ పిన్ కు పంపిస్తారు. వాట్సాప్ లో వచ్చిన నోట్ ను నైజీరియాలో ఉన్న హవాలా దందా వారికి చూపిస్తే వారు అక్కడి దేశ కరెన్సిలో డబ్బులు చెల్లిస్తున్నట్లు టీజీ నాబ్ గుర్తించింది. అదే విధంగా గోవాలో డ్రగ్స్ దందా చేస్తు సంపాదించిన డబ్బును నైజీరియాలోని పలు బ్యాంకులకు దాదాపు 10 కోట్లు నైజీరియా కరెన్సికి సంబంధించిన లావాదేవిల ఆధారాలను టీజీ నాబ్ అధికారులు సేకరించారు. 26 మే నుంచి జూన్ 3వ తేది వరకు ఈ డ్రగ్స్ ముఠాలు దాదాపు 2.10 కోట్ల నగదును నైజీరియాకు పంపినట్లు టీజీ నాబ్ అధికారులు తెలుసుకున్నారు. ఇలా ప్రత్యేక అపరేషన్ చేసిన టీజీ నాబ్ వద్ద ఇప్పుడు దాదాపు గోవా కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్న 50 చిట్టాను సేకరించి పెట్టుకున్నారు. మరో అపరేషన్ ను నిర్వహించి వీరందరీని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దీని కోసం ఓ ప్రణాళిక తో టీజీ నాబ్ సిద్ధంగా ఉంది. ఈ 50 నెట్ వర్క్ ను ధ్వంసం చేస్తే ఇక హైదరాబాద్ కు విదేశి డ్రగ్స్ ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు రావడం పూర్తి బంద్ అవుతుందని టీజీ నాబ్ అధికారులు ఆశిస్తున్నారు. ఈ విధంగా టీజీ నాబ్ విదేశి డ్రగ్స్ ముఠాల పై పంజా విసిరి వారిని పరేషాన్ చేస్తోంది.

Next Story