కాలి బూడిదైన ఫర్నిచర్ గోదాం...

by Bhanu |

అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ఫర్నిచర్ గోదాం కు మంటలంటుకొని కాలి బూడిదైన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కాలి బూడిదైన ఫర్నిచర్ గోదాం...
X

దిశ,కార్వాన్ : అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ఫర్నిచర్ గోదాం కు మంటలంటుకొని కాలి బూడిదైన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... ఆసిఫ్ నగర్ జిర్ర ప్రాంతానికి చెందిన ఎండి తాజ్ కు ఫర్నిచర్ గోదాము ఉంది. అయితే ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. కాగా షార్ట్ సర్క్యూట్తో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ప్రాణ నష్టం లేకపోవడంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫర్నిచర్ గోదాంలో ఎంతవరకు నష్టం అనేది ఇంకా అంచనా స్పష్టంగా లేదని పోలీసులు తెలిపారు.


Next Story