సీతక్కతో ఎలాంటి పంచాయితీ లేదు: క్రమ శిక్షణా కమిటీకి కొండా మురళి లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-28 07:54:16  IST  )

మంత్రి సీతక్కతో తమకు పంచాయితీ లేదని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు

సీతక్కతో ఎలాంటి పంచాయితీ లేదు: క్రమ శిక్షణా కమిటీకి కొండా మురళి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: తమకు మంత్రి సీతక్క(Minister Sitakka)తో పంచాయితీ లేదని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి(Konda Murali) తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. క్రమ శిక్షణ కమిటీకి 17 పేజీల లేఖను కొండా మురళి అందజేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. క్రమ శిక్షణా కమిటీ ముందుకు రావాలని తనను పిలవలేదని, పార్టీపై ఉన్న గౌరవంతో తాను వచ్చానని చెప్పారు. మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. పరకాల నియోజకవర్గం పూర్తిగా తమదేనని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి వివాదాలు పెరిగాయని చెప్పారు. తన భార్య కొండా సురేఖపై వివాదాలు సృష్టించారని తెలిపారు. రేవూరికి తాను సాయం చేశానని, కానీ తమపై కుట్రలు చేస్తున్నారని చెప్పారు. నాయిని రాజేందర్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, పెద్ద పెద్ద సెటిల్ మెంట్లు చేస్తున్నారని కొండా మురళి తెలిపారు. బీఆర్ఎస్ నుంచి తాను కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు రాజీనామా చేసి చేరానని తెలిపారు. కొంతమందిలా పార్టీ మారినా పదవిలో కొనసాగలేదని కొండా మురళి ఎద్దేవా చేశారు.

Next Story