గిరిజన బిడ్డలపై అమానుషం: ‘ఎక్స్’లో కేటీఆర్ సంచల ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-23 16:09:43  IST  )

గిరిజన బిడ్డలపై దాడి అమానుషమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు..

గిరిజన బిడ్డలపై అమానుషం: ‘ఎక్స్’లో కేటీఆర్ సంచల ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘హైదరాబాద్ మీదకే కాదు.. అడవి మీదకూ బుల్డోజర్లు’ ఈ ప్రభుత్వం పంపిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు. పేదలు అన్న ప్రేమ లేదని.. ఆడబిడ్డలు అన్న ఇంగితం లేదని విమర్శించారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీలపై దాడి అమానుషమని పేర్కొన్నారు. 420 హామీలను అమలు చేయలేక.. ఇవ్వని హామీలు హైడ్రా, మూసా ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూల్చడం.. రోడ్ల విస్తరణ, పరిశ్రమలకు భూసేకరణ పేరుతో లగచర్ల, దిలావర్‌పూర్, పెద్ద ధన్వాడ, చారగొండ, సిరసనగండ్లలో రైతుల పొలాల్లోకి, ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపడం ఇదే ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. పట్నం, పల్లెలు దాటి ఇప్పుడు అడవులు, ఆదివాసీల మీద పడ్డారని ఆరోపించారు. ప్రశ్నిస్తే, ఎదిరిస్తే, నిలదీస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని పేర్కొన్నారు.

Next Story