పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తింటున్నారా..? మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు

by Muthe.Rajitha |

రంజాన్ మాసంలో హలీంకు ఫేమస్ అయిన పిస్తా హౌస్ గురించి మనకి తెలిసిందే.

పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తింటున్నారా..? మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు
X

దిశ, వెబ్ డెస్క్ : హలీంకు, బిర్యానీకి ఫేమస్ అయిన పిస్తా హౌస్ గురించి మనకి తెలిసిందే. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పిస్తా హౌస్ హలీంకు ఎగబడుతుంటారు. పిస్తా హౌస్ అనేది హైదరాబాద్ ఫుడ్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. అయితే ఇకపై మీరు పిస్తా హౌస్ వైపు కన్నెత్తి కూడా చూడరు. కారణం ఏమిటంటే పిస్తా హౌస్ రెస్టారెంట్‌లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్, టాస్క్ ఫోర్స్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో బయటపడిన దారుణమైన విషయాలు. మొత్తం 25 పిస్తా హౌస్‌ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి 23 చోట్ల శాంపిల్స్‌ సేకరించారు.

అనేక చోట్ల కిచెన్‌ పరిసరాల అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా... కిచెన్‌లోని ఆహారపదార్థాలపై ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకులు ఆహార పదార్థాలు కంటికి ఇంపుగా కనిపించేందుకు నాన్‌ వెజ్‌ వంటకాల్లో సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్న తేలింది. అలాగే తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్‌ వెజ్‌ స్టోర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీ అధికారులు ఎన్నిసార్లు రైడ్ చేసినా.. చాలాచోట్ల నిర్వాహకులు తమ తీరును మార్చుకోవడం లేదు.

Next Story