- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : నగరవాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఇవి బంద్
హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు బిగ్ అలర్ట్(Big Traffic Alert) ప్రకటించారు అధికారులు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరవాసులకు బిగ్ అలర్ట్(Big Traffic Alert) ప్రకటించారు అధికారులు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా గురువారం "షబ్-ఎ-ఖదర్"(Jugne Ki Rath) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ(Bike Rally) తీయనున్న నేపథ్యంలో పలు ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు(Fly Overs Close) ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలో క్లోజ్ చేసే ఫ్లైఓవర్స్ ఇవే..
*డా. మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ (జూ పార్క్ నుండి ఆరంగర్ వరకు)
*బహదూర్‌పురా ఫ్లైఓవర్ (దేవిబాగ్ నుండి జూపార్క్ వరకు)
*చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ (హషంబాద్ నుండి ఫూల్‌బాగ్ డీఎల్‌ఆర్‌ఎల్ వరకు)
*డా. ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ (పిసల్‌బండ నుండి లక్ష్మారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు)
వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ఏదైనా అసౌకర్యం ఎదురైతే, ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ – 9010203626 ను సంప్రదించాలని తెలియజేశారు. తిరగి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ద్విచక్ర వాహనాలను ఆయా ఫ్లైఓవర్ల మీదికి అనుమతిస్తామని పేర్కొన్నారు.






