ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ.. టౌన్ ప్లానింగ్ విభాగంపైనే అత్యధికం

by Kema Shiva Kumar |

మున్సిపల్ కార్పొరేషన్ ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ.. టౌన్ ప్లానింగ్ విభాగంపైనే అత్యధికం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి వారం నిర్వహించే సీఎంసీ ప్రజావాణి కార్యక్రమానికి ఈసారి 63 ఫిర్యాదులు వచ్చాయి. అందిన ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకునేందుకు, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ సకాలంలో పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధిపతులు వీటిని నిశితంగా సమీక్షించారు. వచ్చిన ఫిర్యాదులలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవే 42 ఉన్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో 65 ఫిర్యాదులు రాగా, అందులో హెడ్ ఆఫీసులోనే 30 వచ్చాయి. ఒక్క ఖైరతాబాద్ జోన్ నుంచే 14 ఫిర్యాదులు అందడం గమనార్హం. అదేవిధంగా ఎంఎంసీ ప్రజావాణిలో 24 వినతులను స్వీకరించారు. తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వినయ్ కృష్ణా‌రెడ్డి స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన 24 వినతిపత్రాలను సంబంధిత విభాగాలకు పంపి, వాటిని తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.

Next Story