- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పొరేట్ ఆఫీస్ @ ఫ్యూచర్ సిటీ!
ఫ్యూచర్ సిటీ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.19కోట్లు కేటాయిచారు.

దిశ, తెలంగాణ బ్యూరో : భారత్ ఫ్యూచర్ సిటీ కార్పొరేట్ ఆఫీసులకు అడ్డాగా మారనుంది. అయితే త్వరలోనే భూముల కేటాయింపుల అంశాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఫ్యూచర్ సిటీవైపే చూసే విధంగా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో వివిధ కార్యాలయాలకు అవసరమైన భూములను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం భూమిని కేటాయించనున్నారు.
ఎఫ్‌సీడీఏ, ఎన్ఐయూఎం
భారత్ ఫ్యూచర్ సిటీ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.19కోట్లు కేటాయిచండంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. దీంతోపాటు మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు నాలెడ్జి పార్టనర్ గా ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్(ఎన్ఐయూఎం) ఆఫీసును సైతం నిర్మించనున్నారు. అయితే 20ఎకరాల్లో ఎఫ్సీడీఏ, ఎన్ఐయూఎం ఆఫీసులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2026 డిసెంబర్ నాటికి పూర్తి
ఫ్యూచర్ సిటీలో సింగరేణి కాలరీస్ కార్పొరేట్ గ్లోబల్ ఆఫీస్ నిర్మించనున్నారు. దీని కోసం 10 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ కార్యాలయ నిర్మాణం 2026 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచ స్థాయి కార్పొరేట్ కార్యాలయం నిర్మించడం ద్వారా సంస్థ విస్తరణకు ఊతమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అధికారులు చెబుతున్నారు. ఒక నుంచి సింగరేణికి సంబంధించిన పరిపాలన, కార్పొరేట్ వ్యవహరాలు ఇక్కడి నుంచే జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
734 ఎకరాలను బదలాయింపు
గతంలో ప్రభుత్వం శంషాబాద్ ఏరియాలో టీఈఈఆర్ఎల్, ఐఐపీహెచ్, వాలంతరీ సంస్థలకు భూములు కేటాయిచింది. అయితే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగానే వీటికి కేటాయించిన భూములను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) సంస్థకు 734ఎకరాలను బదాలయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటు గతలో వీటికి సంబంధించిన భూములకు బదులుగా భారత్ ఫ్యూచర్ సిటీలో భూములను కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటికి సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులను నిర్మించి అక్కడి నుంచే కార్యాకలాపాలను నిర్వహించనున్నారు.
ఏఐకి పెద్ద పీట
ఫ్యూచర్ సిటీకి అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) గుండెకాయలాంటిది. ప్రపంచంలోని న్యూయార్క్ సిటీకి పోటిగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఏఐ సిటీకి పెద్దపీఠ వేయనున్నారు. 500 ఎకరాల్లో నిర్మించే ఏఐ జోన్ కు ఆధునిక హంగులతో ఏఐ సిటీ ఆఫీసును నిర్మించనున్నారు. త్వరలోనే దీనికి భూమి పూజ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఫార్చూన్ కంపెనీలకు పట్టం
ప్రపంచంలో 500 పేరుమోసిన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆఫీసులు హైదరాబాద్ లో 85 మాత్రమే ఉన్నాయి. కానీ ఫ్యూచర్ సిటీలో 500 ఫార్చూన్ కంపెనీలకు సంబంధించిన ఆఫీసులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని, అందుకు బాధ్యత తీసుకుంటానని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఫ్యూచర్ సిటీకి అనుకూలమైన రహదారులు, పక్కన అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉండడంతోపాటు మెట్రోరైలు కూడా నిర్మించే అవకాశమున్న తరుణంలో గ్లోబల్ కంపెనీలు రావడానికి అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.






