మంత్రి పీఏలమంటూ.. అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు : మంత్రి పొంగులేటి

by Bhanu |

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి పర్సనల్​ అసిస్టెంట్ ( పీఏ) ల మ‌ని చెప్పి ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

మంత్రి పీఏలమంటూ.. అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు : మంత్రి పొంగులేటి
X

దిశ, వనస్థలిపురం: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి పర్సనల్​ అసిస్టెంట్ ( పీఏ) ల మ‌ని చెప్పి ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బుస్సా వెంక‌ట‌రెడ్డి ( 34), మ‌చ్చ సురేశ్​( 30) నాగోల్‌లో నివాస‌ముంటున్నారు. వీరు మంత్రి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసుల‌కు ఫోన్లు చేసి పైరవీలు, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి దృష్టికి వ‌చ్చిన వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీనిపై విచార‌ణ జ‌రిపిన పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి త‌న పీఏలమంటూ ఎవ‌రైనా ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం క‌లిగినా సెక్రటేరియట్​లో త‌న కార్యాల‌యం 040-23451072 / 040-23451073 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల‌ని ప్రజలకు సూచించారు. ఎవ‌రైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగప‌రిస్తే క‌ఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Next Story