- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన మరో ఐటీ కంపెనీ
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఐటీ కంపెనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఐటీ కంపెనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 'ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్' పేరుతో నడుస్తున్న ఈ సంస్థ నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో నమ్మక దోపిడీ చేసింది. ట్రైనింగ్ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశ చూపి సుమారు 200 నుంచి 300 మంది బాధితుల నుండి ఒక్కొక్కరినుండి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేశారు.
ట్రైనింగ్ అనంతరం కొందరికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ ఉద్యోగాలంటూ నమ్మబలికారు. కానీ కొద్దికాలానికే బాధితుల ఫోన్ కాల్స్‌ను అటెండ్ చేయకుండానే గాయబ్ అయ్యారు. క్రమంగా సంస్థ కార్యకలాపాలపై అనుమానం కలిగిన బాధితులు గచ్చిబౌలిలోని కంపెనీ కార్పొరేట్ కార్యాలయాన్ని సందర్శించగా, అక్కడ అలాంటి సంస్థ ఏదీ లేదని తెలుసుకుని మోసపోయామని గుర్తించారు.
దీంతో బాధితులు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కష్టార్జితాన్ని మోసం చేసిన ఈ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, తాము చేసిన ఖర్చును తిరిగి పొందేలా న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






