హైదరాబాద్ లో నకిలీ ఆపిల్ మొబైల్ పరికరాలు.. ముఠా గుట్టు రట్టు..!

by Bhanu |

నకిలీ ఆపిల్ బ్రాండ్ పరికరాలు అమ్ముతున్న షాపులపై టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలిసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 4 గురిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో నకిలీ ఆపిల్ మొబైల్ పరికరాలు.. ముఠా గుట్టు రట్టు..!
X

దిశ, కార్వాన్ : నకిలీ ఆపిల్ బ్రాండ్ పరికరాలు అమ్ముతున్న షాపులపై టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలిసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 4 గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఇమాన్యూల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అబిడ్స్ జగదీశ్ మార్కెట్ లోని మాతాజీ, ఆర్. జి. మొబైల్, రాజారామ్, న్యూ డ్రీమ్స్ సెల్ఫోన్ దుకాణాలో విక్రమ్ సింగ్(30), సురేష్ కుమార్(25), మహ్మద్ సర్ఫరాజ్(24) నాథురామ్ చౌదరి(25), నకిలీ ఆపిల్ మొబైల్ పరికరాలు అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు అర్షద్ పరారయ్యాడు.

కాగా వారిని విచారించగా ముంబైలోని అమిత్ భాయ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు,సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఈ దారిని ఎంచుకున్నట్లు సీఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి 4 గురినీ రిమాండ్ కు తరలించారు.

Next Story