అమాయ‌కుల డ‌బ్బును కొట్టేస్తున్న ఫేస్ బుక్..!

by Ratna Kumari |

ఫేసుబుక్, ఇన్ స్టా గ్రామ్‌ యూజర్ లను బోల్తా కొట్టించి వారిని నిండా ముంచేందుకు సైబర్ మోసగాళ్లు కొన్ని ప్రోఫైల్స్ ను రూపొందించి వైరల్ చేస్తున్నారు.

అమాయ‌కుల డ‌బ్బును కొట్టేస్తున్న ఫేస్ బుక్..!
X

దిశ‌, సిటీ క్రైం : ఫేసుబుక్, ఇన్ స్టా గ్రామ్‌ యూజర్ లను బోల్తా కొట్టించి వారిని నిండా ముంచేందుకు సైబర్ మోసగాళ్లు కొన్ని ప్రోఫైల్స్ ను రూపొందించి వైరల్ చేస్తున్నారు. ఈ ప్రొఫైల్స్ లో అధికంగా ఇన్వెస్ట్ మెంట్, రిఫెరల్ బోనస్, బెట్టింగ్ , గేమింగ్ లకు సంబంధించిన అంశాలు ఉండడంతో చాలా మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఆ ప్రొఫైల్స్ లలో ఉన్న లింక్ లను క్లిక్ చేసి ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఈ ఫిర్యాదుల పై దృష్టి పెట్టి సైబర్ క్రైం పోలీసులు సైబర్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. దీంతో దాదాపు 180 ప్రోఫైల్స్ ను గుర్తించారు. ఈ ప్రోఫైల్స్ ద్వారా 801 ప్రకటనలను వైరల్ చేస్తున్నారని విచారణలో తేలింది.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ప్రోఫైల్స్ తీరును నిర్వాహకుల దృష్టి కి తీసుకువెళ్లి వాటిని ఆ ఇన్ స్టా గ్రాం, ఫేసుబుక్ లను నుంచి శాశ్వతంగా డిలీట్ చేశారు. ఇలా సైబర్ క్రైం పోలీసులు ఇప్పటి వరకు 427 ప్రోఫైల్స్ ద్వారా 1903 ప్రమోషనల్ ప్రకటనల చిట్టాను బయటపెట్టి వాటిని సోషల్ మీడియా వేదికల మీద నుంచి తొలగించారు. వీటితో పాటు అమాయకులను నమ్మించేందుకు ప్రముఖుల డీప్ ఫేక్ విడియోలతో ప్రచారం చేస్తున్న విషయాన్ని పసిగట్టి వాటిని కూడా తీసేశారు. ఇక ప్రోఫైల్స్ వెనకాల ఉన్న వారితో పాటు ఆర్ధిక లావాదేవిల అంశంపై పోలీసులు దర్మాప్తును ముమ్మరం చేయనున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

Next Story