- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Vijaya Dairy : తార్నాక విజయ డైరీలో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు
Vijaya Dairy : తార్నాక విజయ డైరీలో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు
by Muthe.Rajitha |
హైదరాబాద్(Hyderabad)లోని తార్నాకలో గల విజయ డైరీ(Tarnaka Vijaya Dairy)లో భారీ పేలుడు(Explosion) సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని తార్నాకలో గల విజయ డైరీ(Tarnaka Vijaya Dairy)లో భారీ పేలుడు(Explosion) సంభవించింది. విజయ డైరీలోని బాదం మిల్క్ తయారు చేసే యంత్రం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అక్కడే పని చేస్తున్న నలుగురు కార్మికులకు(Four Injured) తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
పేలుడుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. కాగా మధ్యాహ్న సమయం కావడంతో చాలామంది కార్మికులు భోజనానికి వెళ్లారని, లేదంటే మరింత మంది గాయపడే వారని తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు జరగగా ప్రాణభయంతో బైటికి పరుగులు తీసినట్టు కార్మికులు చెబుతున్నారు.
Next Story






