గాంధీ ఆసుపత్రిలో గడువు దాటిన మందులు.. డాక్టర్ సప్సెన్షన్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో 2014-15లో గడువు ముగిసిన మందులు(Expired medicine) వాడిన కేసులో HRC కీలక తీర్పు వెలువరించింది.

గాంధీ ఆసుపత్రిలో గడువు దాటిన మందులు.. డాక్టర్ సప్సెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో 2014-15లో గడువు ముగిసిన మందులు(Expired medicine) వాడిన కేసులో HRC కీలక తీర్పు వెలువరించింది. గాంధీ ఆసుపత్రిలో 2014-15లో గడువు ముగిసిన హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు HRC కి ఫిర్యాదు చేయడంతో... కేసు విచారణ చేపట్టి, నేడు తీర్పు వెలువరించింది. బాధితులైన ఎ.ఎన్. ఆదిలక్ష్మి, ఎస్. దేవమణి, టి. సతీష్, పి. మల్లికార్జున్, టి. రవి, జి. ధనుంజయ్ లకు ఒక్కొక్కరికి రూ. 1,25,000 పరిహారం చెల్లించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు.

ఈ ఘటన ఆరోగ్య సంస్థలో వ్యవస్థాగత వైఫల్యాలను బహిర్గతం చేసిందని, బాధితుల హక్కులను ఉల్లంఘించిందని HRC తెలిపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా బాధ్యులపై చర్యలకు ఆదేశిస్తూ... ఔషధ నిర్వహణలో కఠిన మార్గదర్శకాలను రెండు నెలల్లో అమలు చేయాలని సూచించారు. HRC ఆదేశాలతో ఘటనకు కారణమైన వైద్యురాలిని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సస్పెండ్ చేసారు.

Next Story