హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్.. 1200 మందికి ఉద్యోగ అవకాశాలు

by Javid Pasha |

హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్.. 1200 మందికి ఉద్యోగ అవకాశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : చికాగో నుంచి చార్మినార్, బోస్టన్ నుంచి బంజారాహిల్స్, లండన్ నుంచి లింగంపల్లి వరకు మెక్ డొనాల్డ్ పరుగులు పెట్టనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్స్(జీసీసీ)లకు అడ్డాగా మారనుంది. జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించే యోచనలో అమెరికా(చికాగో)కు చెందిన మెక్ డొనాల్డ్ తన ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1.56 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన హబ్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు. అయితే టెక్నాలజీ, డేటా అనాలిటిక్స్, ఫైనాన్స్, కార్పొరేట్ ఫంక్షన్స్, ప్రపంచ వ్యాప్తంగా ఆపరేషన్స్ వంటి అంశాలపై మెక్ డొనాల్డ్ ఇన్నోవేషన్, ఎంటర్ ప్రైజెస్ ఆపరేషన్స్ హబ్ ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. దీని ద్వారా డైరెక్ట్ 1200 హై స్కిల్డ్ ఎంప్లాయిమెంట్ లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు అధికారులు చెబుతున్నారు.

Next Story