- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనాభా లెక్కల స్వీయ గణన ప్రతి ఒక్కరు చేసుకోవాలి : కలెక్టర్ ప్రియాంక ఆల
జనాభా లెక్కలలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల విజ్ఞప్తి చేశారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : జనాభా లెక్కలలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మాట్లాడుతూ దేశ జనాభా లెక్కలు 2027 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 26 నుంచి స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైందని, ఈ నెల 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుందని, అన్ని రంగాలలో ఉన్నటువంటి జిల్లా ప్రజలు, ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలన్నారు. అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.inలో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుపరిపాలన, సమానాభివృద్ధికి జనాభా లెక్కలు అత్యవసరమని, స్వీయ గణన సమగ్ర సమాచార సేకరణకు బలమైన పునాదిగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.






