ప్రతి ఒక్కరు నేత్రదానానికి ముందుకు రావాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

by Elthuri vijay kumar |

ప్రతి ఒక్కరు నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు నేత్రదానానికి ముందుకు రావాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
X

ప్రతి ఒక్కరు నేత్రదానానికి ముందుకు రావాలి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

దిశ, కార్వాన్: ప్రతి ఒక్కరు నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆస్పత్రి సుపరింటెండెంట్ మోదిని అధ్యక్షతన మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజ్జనార్ పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ మారుమూల ప్రాంతాల్లోని నేత్రాలను ఉచితంగా ఆసుపత్రికి తరలించేందుకు ఐస్ బాక్స్‌ తో బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆప్తమాలజీ హెచ్.ఓ.డీ డాక్టర్ వెంకటరత్నం దేశవ్యాప్తంగా 13 లక్షల కార్నియా బ్లైండ్నెస్ ఉన్నట్లు, ప్రతి సంవత్సరం 30–40 వేల కార్నియాలు దానంతో కోల్పోయిన చూపును తిరిగి పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజారావు, సిద్దిపేట మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ సంగీత్ షా, ఎన్‌పీసీబీ జాయింట్ డైరెక్టర్ కళావతి, సరోజినీ దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని, ప్రొఫెసర్లు సత్యవాణి, శ్రీనివాస్, శ్రీధర్, విజయలక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు.

Next Story