డీజిల్ కూపన్లు అమ్ముకున్న ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి

by Ratna Kumari |

దిశ, చైతన్యపురి : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలో పనిచేస్తున్న ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

డీజిల్ కూపన్లు అమ్ముకున్న ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి
X

దిశ, చైతన్యపురి : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలో పనిచేస్తున్న ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డివిజన్లలో ఫాగింగ్ చేయకుండా ఫాగింగ్ చేసినట్టు బిల్లులు డ్రా చేసిన వైనం బయటపడింది. ఈయనకు తోడుగా ఔట్ సోర్సింగ్ ఏఈలు రాంబాబు, మణెమ్మలు వంత పాడారు. ఇదేమని ప్రశ్నించిన పాపానికి ఎంటమాలజీ కార్మికులపై బూతు పురాణం మొదలుపెట్టారు. చేసేది లేక కార్మికులు తమ యూనియన్ నేతలతో కలిసి బుధవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ జోన్ లో ఐదు సర్కిల్స్ ఉండగా.. 1, 2, 3 సర్కిల్ లలో ఫాగింగ్ మిషన్ల మీద ఆల్టర్ నేట్ చేసి 4, 5 సర్కిలలో చేయకపోవడం ఏమిటని కార్మికులకు అర్థం కాక నెలరోజులైనా ఇప్పటివరకు చేయడంలేదని వాటిలో చేయ‌మ‌ని అడిగితే ఇష్టమొచ్చినట్టు బూతులు తిడుతున్న సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డిని సస్పెండ్ చేయాలని జీహెచ్ఎంఈయు అధ్యక్షులు ఉదరి గోపాల్ డిమాండ్ చేశారు.

ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు ఎంటమాలజీ కార్మికులతో కలసి బుధవారం నిరసన వ్యక్తం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్కిల్ 5 లో ఏడో తారీఖు నుండి 18 తారీకు వరకు ఆటో రాకపోయినా ఫాగింగ్ నడిపినట్టు కూపన్ డ్రా చేసిన సీనియర్ ఎంటమాలజిస్ట్ ఏఈ రాంబాబు, సర్కిల్ ఫోర్ ఏఈ మణెమ్మ లు చాలా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అందుకే అక్కడ ఆల్టర్ నేట్ చేయలేకపోతున్నారని వీళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ రెడ్డి, ఔట్ సోర్సింగ్ ఏఈ రాంబాబు, మరో ఏఈ మనెమ్మ లు అవినీతికి పాల్పడుతున్నారని కార్మికులు చెబితే వారిని బూతులు తిడుతున్నారని ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డీజల్ కూపన్లను అమ్ముకుని అవినీతికి పాల్పడుతున్న వీరిపై కమిషనర్ విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు పిర్యాదు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎంటమోలోజి ఎంప్లొయ్స్ జనరల్ సెక్రటరీ పరమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్, ఔట్సోర్సింగ్ ఎంప్లొయ్ యూనియన్ సంజు కుమార్, బాలు, స్వర్ణకుమార్ పాల్గొన్నారు.

Next Story