రాయదుర్గంలో ఓ ఇంట్లో భారీగా విద్యుత్ మీటర్ల స్వాధీనం

by Bhanu |

విద్యుత్ శాఖలో భారీ అవినీతి బయటపడుతుంది. పదుల సంఖ్యలో విద్యుత్ మీటర్లు పట్టుబడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.

రాయదుర్గంలో ఓ ఇంట్లో భారీగా విద్యుత్ మీటర్ల స్వాధీనం
X

దిశ, శేరిలింగంపల్లి : విద్యుత్ శాఖలో భారీ అవినీతి బయటపడుతుంది. పదుల సంఖ్యలో విద్యుత్ మీటర్లు పట్టుబడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీ ఎత్తున విద్యుత్ మీటర్లు పట్టుబడ్డాయి. ఇన్స్టాల్ చేయని నూతన విద్యుత్ మీటర్లు కనబడడం లేదంటూ విద్యుత్ శాఖ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐ వెంకన్న దర్యాప్తు చేపట్టారు. అయితే ఒక ఇంటిలో డచిన విద్యుత్ మీటర్లను చెన్న కేశవరెడ్డి అనే వ్యక్తి ఆటోలో మరో చోటకు తరలించినట్లు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రాయదుర్గం టెలికం నగర్ లోని తన ఇంట్లో 42 విద్యుత్ మీటర్లను కాంట్రాక్టర్ చెన్న కేశవరెడ్డి అక్రమంగా దాచినట్లు గుర్తించారు. వినియోగదారులకు రిలీజ్ అయిన సర్వీస్ లకు సంబంధించిన మీటర్లు ఓ ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో దొరకటంపై రాయదుర్గం పోలీసులు విద్యుత్ మీటర్ల చోరీకి సంబంధించి చెన్న కేశవ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story