సోషల్ మీడియాపై ఎన్నికల సంఘం నజర్

by Ajay Maddhiboyina |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఫేక్ ఓట్ల దుమారం చర్చనీయాంశంగా మారింది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నా యని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ చేసిన ఆరోపణలకు ఎన్నికల సం ఘం స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాపై ఎన్నికల సంఘం నజర్
X

దిశ, సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఫేక్ ఓట్ల దుమారం చర్చనీయాంశంగా మారింది. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నా యని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మరిచిపోకముందే టాలీ వుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫేక్ ఓటర్ ఐడీ లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటర్ల జాబితాలో వీరి పేర్లు కనబడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారు లు నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. హీరో యిన్ల ఫేక్ ఓటరు ఐడీ నెంబర్లు అధికారులు రూపొందించిన జాబితాలో నిజం గానే వీరి పేర్లు ఉన్నాయా? లేదా ఎవరై నా దురుద్దేశంతో ఇలా సామాజిక మా ధ్యమాల్లో పోస్ట్ చేశారా? అనేదానిపై అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వేరే ఓటర్ల ఎపిక్ నెంబర్లతో హీరోయిన్ల ఫొటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు త యారు చేసినట్లు తెలుస్తోంది. ఫేక్ ఓట ర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యా రు. దీంతో రంగంలోకి దిగిన అధికారు లు.. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశా లపై విచారిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోలు వైరల్ చేయడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులు కలిసి సోషల్ మీడియా పోస్టులపై పరిశోధించి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల సమ యంలో ఇలాంటి ఫేక్ పోస్టులను వైరల్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు

సమంత, రకుల్ ప్రీత్‌సింగ్, తమన్నలకు ఫేక్ ఓటరు ఐడీలతో కూడిన ఓటరు లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటనపై జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో) మధురానగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫేక్ ఓటరు ఐడీ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story