జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈసీ ఫోకస్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-16 03:25:35  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొన్నదనే చెప్పాలి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈసీ ఫోకస్
X

దిశ, సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election)పై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొన్నదనే చెప్పాలి. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం సైతం ఫోకస్ పెట్టింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. నాలుగేండ్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలించడంతో ఎక్కడెక్కడ తక్కువగా నమోదైందనే అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రముఖుల తో ప్రచారం చేయించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

తగ్గుతూ వస్తున్న పోలింగ్ శాతం

జూబ్లీహిల్స్‌లో 2009 నుంచి 2023 వరకు జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతంపై అధికారులు పరిశీలించారు. అయితే 2009లో 52 శాతం నమోదైంది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎ న్నికల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా 45.59 శాతానికి పోలింగ్ తగ్గిం ది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,41,537 ఓట ర్లు ఉండగా, 1,55,729 ఓట్లు పోల్ అ య్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొ త్తం 3,75,430 ఓటర్లు ఉండగా ఇందులో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. 48.82 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పో లింగ్ శాతం తగ్గినప్పటికీ జూబ్లీహిల్స్ మా త్రం 2018 ఎన్నికల కన్నా పెరిగింది. 2009, 2014 ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గింది. అయితే ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందని, అం దుకు కంటోన్‌మెంట్‌లో 3 శాతం పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

50 శాతానికిపైగా..

జూబ్లీహిల్స్ ఒక్క నియోజకవర్గం లో మాత్రమే ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం పైనే దృష్టి పెట్టాయి. ప్రచారం సైతం ఎక్కువగానే జరుగుతుంది. ఇలా ఓ టర్లు అత్యధికంగానే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,367, మహిళలు 1,91,590, ఇతరులు 25 మంది ఉన్నారు. ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గంలో 407 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు పెంచాలని నిర్ణయించారు. ఈ సారి 50 శాతానికిపైగా పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.




Next Story