దేవుడి ముందు మాదకద్రవ్యాల రీల్స్.. ఇద్దరు యువకులు అరెస్ట్

by Ratna Kumari |

దేవుడి ముందు మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

దేవుడి ముందు మాదకద్రవ్యాల రీల్స్.. ఇద్దరు యువకులు అరెస్ట్
X

దిశ, చంపాపేట్: దేవుడి ముందు మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పవిత్రమైన పండుగ రోజున ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. యువత సోషల్ మీడియా కోసం చట్టాన్ని ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఫలక్‌నుమా జంగమ్‌మెట్‌కు చెందిన సభావత్ శ్రీ చరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు యువతకు హెచ్చరిక చేస్తూ సోషల్ మీడియాలో లైకుల కోసం మత్తు పదార్థాల ప్రదర్శనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Next Story