బాసిలర్ ఆర్టరీ స్టెంటింగ్‌తో రోగికి ప్రాణం పోసిన హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు

by Ratna Kumari |

మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన న్యూరోవాస్కులర్ ప్రక్రియను విజయవంతంగా శాస్త్ర చికిత్స నిర్వహించారు.పునరావృత స్ట్రోక్స్‌తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన 54 ఏళ్ల ఉసేన్ భాషకు కొత్త జీవితం ప్రసాదించారు.

బాసిలర్ ఆర్టరీ స్టెంటింగ్‌తో రోగికి ప్రాణం పోసిన హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
X

దిశ, శేరిలింగంపల్లి : మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన న్యూరోవాస్కులర్ ప్రక్రియను విజయవంతంగా శాస్త్ర చికిత్స నిర్వహించారు. పునరావృత స్ట్రోక్స్‌తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన 54 ఏళ్ల ఉసేన్ భాషకు కొత్త జీవితం ప్రసాదించారు. మెదడులో అత్యంత కీలకమైన రక్తనాళాల్లో ఒకటైన బాసిలర్ ఆర్టరీ దాదాపు పూర్తిగా మూసుకుపోవడంతో రోగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రోగి మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం, తీవ్రమైన తల తిరగడం, నడిచేటప్పుడు సమతుల్యత కోల్పోవడం, సహాయం లేకుండా నడవలేకపోవడం వంటి తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. గత కొన్ని నెలలుగా నిరంతర మందుల చికిత్స పొందుతున్నప్పటికీ పలుమార్లు స్ట్రోక్‌కు గురయ్యాడు. రోగికి హైబీపీ, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు ఉండగా.. గతంలో సీఏబిజీ సర్జరీ, యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారు.

మెడికవర్ హాస్పిటల్స్‌లో నిర్వహించిన అత్యాధునిక న్యూరోవాస్కులర్ స్కానింగ్, డయాగ్నస్టిక్ సెరెబ్రల్ యాంజియోగ్రఫీ (DSA) పరీక్షల్లో రోగి బాసిలర్ ఆర్టరీలో దాదాపు 99 శాతం బ్లాకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి మెదడు కండర భాగానికి రక్తప్రసరణను తీవ్రంగా అడ్డుకోవడంతో బ్రెయిన్‌స్టెమ్ స్ట్రోక్, పక్షవాతం, కోమా, ఆకస్మిక మరణం వంటి ప్రమాదాలకు దారితీసే అవకాశముందని వైద్యులు తెలిపారు. మెడికవర్ న్యూరో సైన్సెస్ మల్టీడిసిప్లినరీ బృందం కన్సల్టెంట్ స్ట్రోక్ & ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అన్నపురెడ్డి జగదీష్ నాయకత్వం వహించగా, కన్సల్టెంట్ న్యూరో & ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కామేపల్లి హరి కిషోర్‌తో పాటు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరో క్రిటికల్ కేర్ ,రీహాబిలిటేషన్ బృందాలు సమన్వయంతో అత్యంత క్లిష్టమైన శాస్త్ర చికిత్స నిర్వహించారు.

Next Story