- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురికివాడలు, కాలనీలను కలపొద్దు: ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ఆర్‌వీ కర్ణన్
జీహెచ్‌ఎంసీలో జనగణన పనులు వేగవంతం అయ్యాయి. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సీసీఎంఎస్ పోర్టల్ నమోదుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణన, హౌస్ లిస్టింగ్ బ్లాకుల రూపకల్పనలో మురికివాడలు, ఇతర కాలనీలను కలపొద్దని, వీటిని వేర్వేరుగానే గుర్తించాలని ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనరన్ ఆర్వీ.కర్ణన్ పేర్కొన్నారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ల నియామకం వంటి అంశాలపై చార్జ్ సెన్సెస్ ఆఫీసర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, కంటోన్మెంట్ అధికారులతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీలోగా హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్స్, జనాభాకు సంబంధించిన వివరాలను సీసీఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సర్కిల్ స్థాయిలోనే ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ల నియామక ప్రక్రియను ఈనెల 18వ తేదీలోగా పూర్తి చేయాలని అన్నారు. ఈనెల 18 నుంచి మే 5 వరకు సర్కిల్ స్థాయిలోనే ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతోాపాటు ఈనెల 24వ తేదీ నుంచి మే 9 వరకు ఆన్ లైన్ ద్వారా ఎవరికివారు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశముందని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్(ఎన్నికలు) చంద్రకళ, సీఎంసీ అడిషనల్ కమిషనర్ హేమంత్ బొర్కడే, ఎంఎంసీ అడిషనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ తదితరులు పాల్గొన్నారు.






