స్థానికంగా శాంతియుత వాతావరణానికి భంగం..మంచు మనోజ్ బైండోవర్

by Chintha Aamani |   (  Updated:2024-12-11 16:31:33  IST  )

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్లపల్లి లోని

స్థానికంగా శాంతియుత వాతావరణానికి భంగం..మంచు మనోజ్ బైండోవర్
X

దిశ, సిటీక్రైం : పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి హైదరాబాద్ శివారు జల్లపల్లి లోని మంచు టౌన్ షిప్ లో గత ఆదివారం నుంచి మూడు రోజులు గా చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఇచ్చిన నోటీసుకు సినీ నటుడు మంచు మనోజ్ బుధవారం హాజరయ్యారు. నేరేడ్ మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలోని మూడవ అంతస్తులో పోలీసు కమిషనర్ సుధీర్ బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో నిర్వహించి కోర్టు ముందుకు మంచు మనోజ్ వచ్చారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 126 నోటీసును అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్ బాబు చదివారు. స్థానికంగా ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పరిస్థితులు మరోసారి నెలకొనకుండా ఉండాలంటే చట్టానికి లోబడి ఉండాలని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్ బాబు ఆదేశించారు. ఈ సందర్భంగా మంచు టౌన్ షిప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని , చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉండాలన్నారు.

దీంతో మంచు మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్ బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసిఇచ్చారు. దీంతో మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు. అనంతరం మనోజ్ వెళ్లిపోయారు. రాత్రి మంచు విష్ణు సీపీ సుధీర్ బాబు ముందు హాజరైయారు. ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్ట బద్దంగా నడుచుకుంటామని విష్ణు సీపీ కి హామీ ఇచ్చారు. కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు ఇచ్చిన ఉత్తర్వుల గురించి సీపీ కి విష్ణు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తేదీ తర్వాత పోలీస్ విచారణ ప్రక్రియకు సంబంధించిన సమాచారం ఇస్తామని సీపీ విష్ణుకు తెలిపారు. రాత్రి 8 గంటలకు వచ్చిన విష్ణు గంటన్నర తర్వాత తిరిగి వెళ్లిపోయారు.మోహన్ బాబుకు కూడా ఈ నోటీసులు అందినప్పటికి కోర్టు ను ఆశ్రయించడం తో ఈ నెల 24 వ తేదీ వరకు ఊరట లభించింది.

Read More...

Breaking: మోహన్‌బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్


Next Story