జీహెచ్ఎంసీ ఆస్తుల నిర్వహణకు డిజిటల్ వేదిక

by Malleboina Mahesh |

పురపాలక మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, మోడల్ మార్కెట్లు, లీజు భూములు వంటి ఆస్తుల నిర్వహణను మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులో కి తీసుకొచ్చింది.

జీహెచ్ఎంసీ ఆస్తుల నిర్వహణకు డిజిటల్ వేదిక
X

దిశ, సిటీ బ్యూరో: పురపాలక మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, మోడల్ మార్కెట్లు, లీజు భూములు వంటి ఆస్తుల నిర్వహణను మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులో కి తీసుకొచ్చింది. ‘ఎస్టేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎంఎస్)’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను సెప్టెంబర్ 24న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈఎంఎస్ ద్వారా లీజుదారులు తమ లీజు చెల్లింపులు, అద్దె మొత్తాలను ఆన్‌ లైన్‌లోనే సులభంగా చెల్లించవచ్చు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారితనం, వ్యవస్థలో సమర్థత పెరగనుంది.

మానవ జోక్యం తగ్గి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందుతాయి. వినియోగదారుల ఫ్రెండ్లీగా రూపొందించిన ఈ యాప్‌లో డిమాండ్, కలెక్షన్, బ్యాలె న్స్ (డీసీబీ) వివరాలు రియల్‌టైమ్‌లో కనిపిస్తాయి. ఫీల్డ్ స్థాయి నుంచి హెడ్ ఆఫీస్ వరకు మానిటరింగ్‌కు ఇది దోహదపడుతుం ది. పురపాలక ఆస్తుల నిర్వహణను బలోపేతం చేయడం, ప్రభావంతంగా నిర్వహించడంలో ఈ డిజిటల్ వేదిక కీలకంగా నిలవనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు.

Next Story