పని ఒకటే.. బిల్లులు వేర్వేరు!

by Ajay Maddhiboyina |

అన్యువల్ మె యింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసీ) కింద చేపట్టిన పనులకు వేర్వేరుగా బి ల్లులు చెల్లించి కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పనులను ఓ వైపు వాటర్ బోర్డు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే మరోవైపు అవే పనులు ఇంజి నీర్లు నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. ఇలా ఒకటి, రెండు పనులు కాదు.

పని ఒకటే.. బిల్లులు వేర్వేరు!
X

దిశ, హిమాయత్ నగర్: అన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసీ) కింద చేపట్టిన పనులకు వేర్వేరుగా బిల్లులు చెల్లించి కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పనులను ఓ వైపు వాటర్ బోర్డు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే మరోవైపు అవే పనులు ఇంజినీర్లు నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. ఇలా ఒకటి, రెండు పనులు కాదు. ఏకంగా వందల సంఖ్యలో పనులు చేసినట్లుగా బిల్లులు చెల్లించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్కో డివిజన్లో రెండేళ్లలో రూ.కోట్లల్లో ఖర్చు చేసి నట్లు సమాచారం. సెక్షన్ల వారీగా ప నులన్నీ ఒకే గుత్తేదారుడు అప్పగించిన తర్వాత కూడా అడ్డగోలుగా పనులు చేయించడంపై పలు అనుమానాలు తావిస్తోంది.

గ్రేటర్ పరిధిలోని ప్రధాన రోడ్లను కాం పెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం మెయింటెనెన్స్ (సీఆర్ఎంపీ) కింద పలు ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అప్పగించింది. దాంతో రోడ్ల నిర్వహణ కొంత మెరుగుపడింది. అదే తరహాలో తాగునీటి, మురుగునీటి మరమ్మత్తుల పనులను కూడా చేయించడానికి మూ డేళ్ల క్రితం వాటర్ బోర్డు అన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసీ) విధానాన్ని తీసుకొచ్చింది. డివిజన్లలోని సెక్షన్ల వారీగా పరిధిని విభజించి రెండేళ్ల కాలానికి (2022-23, 2023-24) టెండర్లు పిలిచి ప్రైవేటు ఏజెన్సీలకు పనులు అప్పగించారు. మురుగునీరు, తాగునీటి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించే బాధ్యతలను కూడా వారికే అప్పగించారు. ఇవి పలు డివిజన్లలో కొంతవరకు సత్ఫలితాన్నిచ్చాయి. దాంతో నాలుగు నెలల క్రితం కూడా మరో రెండేళ్లకు పనులను ఏజెన్సీలకు అప్పగించారు.

వాటర్ బోర్డులో పలు డివిజన్లలో అత్యవసర పనులన్నీ నామినేషన్లపై అప్పగిస్తారు. ఆపరేషన్ మె యింటనెన్స్ కింద రూ.5 లక్షల వరకు చేసే పనులు అత్యవసరంగా డివిజన్లలోని అధికారులు చేపట్టవచ్చు. అయి తే టెండర్ వేసే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విభజించి మరీ నామినేషన్లపై చేయిస్తుంటారు. ఏఎంసీ విధానం వచ్చాక అడ్డగోలుగా చేసే ఖర్చులకు చెక్ పడింది. 2022-2024 వరకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఏఎంసీ కింద గుత్తేదార్లుకు పనులు అప్పగించారు. సెక్షన్ల వారీగా ఏడాదికి రూ.20లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వ్యయాన్ని నిర్ణయించి టెండర్లు చేపట్టి గుత్తేదార్లను ఎంపిక చేశారు. పనులు చేస్తేనే విడతల వారీ గా బిల్లులిచ్చారు. అయితే ఏఎంసీ కింద ఏజెన్సీలకు పనులు అప్పగించిన తర్వాత కూడా పలు డివిజన్లలో పైపు లైన్ల, పగిలిన సీవరేజీ లైన్, లీకేజీలు, కాల్వల మరమత్తులు, పైపులైన్ తొల గింపు, మ్యాన్ హోల్ మరమ్మతులు ఇంజినీర్లు చేయడం విమర్శలకు దారితీస్తుంది.

నామినేషన్లపై విచ్చలవిడిగా ఖర్చులు

కూకట్ పల్లి డివిజన్ ఏఎంసీ కింద ఇష్టానుసారంగా పనులు చేసినట్లు తెలిసింది. ఈ పనులను కూడా నామినేషన్ పద్ధతిలో ఇతరులతో చేయించారు. లక్షల్లో బిల్లులు చెల్లించడంతో అక్రమాలు జరిగినట్లు స్పష్టం అవుతుంది. రెండేళ్ల కాలానికి రూ. 9 కోట్ల వరకు అదనంగా వ్యయం చేసినట్లు స్పష్టమవుతుంది. అదేవిధంగా సైనిక్ పూరి డివిజన్‌లో రూ.5 కోట్ల వరకు, హిమాయత్ నగర్, గోషామహల్, జాంబాగ్, మంగళ్ ఘాట్, గన్‌ఫౌండ్రి, మిగతా డివిజన్లలో 5 కోట్ల నుంచి 3కోట్ల మేర వ్యయం చేసినట్లు తెలు స్తోంది. ఏఎంసీ కింద జరగాల్సిన పనులను మరో గుత్తేదారుడు ద్వారా చేయించడంలో జీఎంలు, సీజీఎంలు కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలు బహిర్గ తం కావడంతో ఔట్సో ర్సింగ్ ఉద్యోగులను బాధ్యులుగా చేసి వారిని బది లీలు చేయడం గమనార్హం.

విజిలెన్స్ విచారణ చేపట్టాలి

డివిజన్ల వారీగా చేసిన పనులపై ఇ టీవల అధికారులు ఆడిట్ చేయిం చగా, ఏఎంసీ కింద చేయాల్సిన పనులు కూడా మళ్లీ నామినేషన్ పద్ధతిలో చేయించినట్లుగా గుర్తించారని స్పష్టమవుతుంది. 2022 -2024 మధ్యకాలానికి సంబంధించిన పను లపై పూర్తిసాయిలో రాష్ట్రస్థాయి విజిలె న్స్ విచారణ జరిపితే మరిన్ని విషయా లు బహిర్గతమావుతాయని వాటర్ బోర్డు విశ్రాంత ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

Next Story