- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
16 మందికి ఐఏఎస్ హోదా.. ఆనందంలో డిప్యూటీ కలెక్టర్లు
రాష్ట్రంలో ఒకే సారి 16 మంది అదనపు కలెక్టర్లకు ఐఏఎస్ హోదా కల్పించినందుకు తెలంగాణ సివిల్ సర్వీసెస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఒకే సారి 16 మంది అదనపు కలెక్టర్లకు ఐఏఎస్ హోదా కల్పించినందుకు తెలంగాణ సివిల్ సర్వీసెస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. శనివారం సంఘం అధ్యక్షుడు వి.విక్టర్, ప్రధాన కార్యదర్శి కే చంద్రకళ, కార్యదర్శి కే వెంకట ఉపేందర్ రెడ్డిలు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సివిల్ సర్వీసెస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. అలాగే వివిధ స్థాయిలో పదోన్నతులు చేపట్టాలని మంత్రిని కోరారు. అదే విధంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్, సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ లను కూడా కలిసి పదోన్నతులు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్, రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం నాయకులు మాలతి, చంద్రావతి, వి.రమాదేవి, సాయిరాంలు పాల్గొన్నారు.






