- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News : గుర్తు తెలియని యువకుడి మృతి
లాలాపేట ప్రధాన రహదారి రాం థియేటర్ సమీపంలో యువకుడు మృతి చెందిన ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, సికింద్రాబాద్: లాలాపేట ప్రధాన రహదారి రాం థియేటర్ సమీపంలో యువకుడు మృతి చెందిన ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఓయూ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు ఓయూ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని యువకుడి(20) ని గుర్తించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. యువకుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. యువకుడిని గుర్తించిన వారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ 8712660569, 8712661263లకు కాల్ చేసి వివరాలు తెలుపాలని పోలీసులు కోరారు.
- Tags
- crimenews
Next Story






