పార్సిగుట్టలో మృతదేహం కలకలం

by Bhanu |

పార్సిగుట్ట లోని ఎంఎన్ఆర్ బార్ ఎదురుగా ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది.

పార్సిగుట్టలో మృతదేహం కలకలం
X

దిశ, సికింద్రాబాద్: పార్సిగుట్ట లోని ఎంఎన్ఆర్ బార్ ఎదురుగా ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. వారసిగూడ సీఐ రమేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రుక్కల శ్యాంసన్ రాజ్ (38) గతంలో ముషీరాబాద్ లో ఉంటూ చాపల మార్కెట్లో పనిచేసేవారు. భార్య పిల్లలు వదిలేయడంతో మద్యానికి బానిసై రాత్రుళ్లు పార్సిగుట్టలోని ఫుట్ పాత్ పై పడుకునేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాడుపడిన ఇంటిలో రక్తపు మడుగులో శ్యాంసన్ ను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో రాడ్ తో అతడిని కొట్టి చంపినట్లు ప్రాథమికంగా తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story