- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదన్నపేట మండిలో ట్రాన్స్‌ఫార్మర్లతో పొంచి ఉన్న ప్రమాదం
యాకత్పుర నియోజకవర్గం కుర్మగూడ డివిజన్ పరిధిలోని మాదన్నపేట మండి పరిసరాల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి

దిశ, చంపాపేట్ : యాకత్పుర నియోజకవర్గం కుర్మగూడ డివిజన్ పరిధిలోని మాదన్నపేట మండి పరిసరాల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ప్రతిరోజూ వందలాది మంది రాకపోకలు జరిగే ఈ రద్దీ ప్రాంతంలోనే రక్షణలేని భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ప్రాంతంలో రెండు భారీ ట్రాన్స్ఫార్మర్లు బహిరంగంగానే ఉండి, వాటికి తగిన రక్షణ గోడలు లేకపోవడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. అదనంగా, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్త పేరుకుపోవడం, ఆ చెత్తలో పశువులు తిరగడం, తినడం వంటి దృశ్యాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బహిరంగంగా వేలాడుతున్న వైర్లు, తడి చెత్త కారణంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడమో, లేదా పశువులు తగిలి ప్రమాదం జరగడమో ఎప్పుడైనా సంభవించవచ్చని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆవేదన
“రోజూ మార్కెట్‌కు వందలాది మంది వస్తారు. పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటారు. చెత్తలో తిరుగుతున్న పశువుల దగ్గరే ట్రాన్స్ఫార్మర్లు ఉండటం చాలా ప్రమాదకరం. చిన్న నిర్లక్ష్యం జరిగినా ప్రాణ నష్టం తప్పదు” అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారుల స్పందన అవసరం
ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు, GHMC అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని, చెత్తను పూర్తిగా తొలగించి శుభ్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. “విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహిస్తే ఎవరైనా ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది? చిన్న సమస్యను పెద్ద ప్రమాదంగా మారకముందే పరిష్కరించాలి” అని స్థానికులు నిలదీస్తున్నారు. మాదన్నపేట మండి వంటి రద్దీ ప్రాంతంలో రక్షణలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుంటేనే ప్రమాదాన్ని నివారించవచ్చు అని స్థానికులు అంటున్నారు.






