కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై సైబరాబాద్ పోలీసులు దాడులు

by Ratna Kumari |

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆహార కల్తీ, అక్రమ ఆహార తయారీ కేంద్రాలు పై ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు తనిఖీలు చేశారు.

కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై సైబరాబాద్ పోలీసులు దాడులు
X

దిశ, శేరిలింగంపల్లి : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆహార కల్తీ, అక్రమ ఆహార తయారీ కేంద్రాలు పై ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే వివిధ నేరాలకు పాల్పడిన 22 మంది పై కేసులు నమోదు చేసి, 28 మందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు, నమ్‌కీన్ వస్తువులు, వంట నూనెలు, గోధుమ పిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం ఉత్పత్తులు, ఐస్ క్రీములు, సాస్‌లు పరిశీలించారు. వంట నూనెను అక్రమంగా పునర్వినియోగించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించారు. గడువు ముగిసిన పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే రసాయనాలను కనుగొన్నారు. వాణిజ్య లైసెన్సులు లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహార పదార్థాలను తయారు చేసి, నిల్వ చేస్తున్నారు. వంట నూనె, గోధుమ పిండిలో భారీ స్థాయిలో కల్తీకి పాల్పడ్డట్లు గుర్తించారు. 5,026 లీటర్లకు పైగా నూనె, 5,192 కిలోగ్రాముల గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. హానికరమైన నిల్వచేసే పదార్థాలు, నకిలీ బ్రాండింగ్‌ను ఉపయోగించి అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్న అక్రమ తయారీ యూనిట్లను కనుగొన్నారు. సుమారు ₹64.07 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, యంత్రాలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story