- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో పెరుగుతున్న క్రైమ్ కేసులు.. సంచలన విషయాలు వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో
రాష్ట్రంలో నేరాలు.. ఘోరాలు గణనీయంగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు అదే స్థాయిలో ఉంది. ఫోర్జరీ మోసాల్లో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేరాలు.. ఘోరాలు గణనీయంగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు అదే స్థాయిలో ఉంది. ఫోర్జరీ మోసాల్లో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. దేశంలోని 16 ప్రధాన నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు ఎక్కువ సంఖ్యలో రికార్డు అయ్యాయి. హైదరాబాద్ లో 4,090 కేసులు నమోదు కాగా, 4,203 మంది బాధితులు మోసపోయినట్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2021-23లో రాష్ట్రవ్యాప్తంగా 1,83,644 క్రిమినల్ కేసులు నమోదైనట్లు రికార్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరిగిన నేరాల వార్షిక నివేదిక వివరాలను 71వ ఎడిషన్ లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న నేరాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://ncrb.gov.in. అందుబాటులో ఉంచింది.
పెరిగిన సైబర్ నేరాలు
2023లో తెలంగాణలో మహిళలపై నేరాలు ఆరు శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో మహిళలపై 23,679 నేరాలు నమోదయ్యాయి. 2022లో 22,065 కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలపై అధిక కేసులు రికార్డు అయ్యాయి. మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ బాగా పెరిగింది. 2021–23 మధ్యకాలంలో 25వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. వాటిలో హింసాత్మక నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల కేసులు పెరిగాయి. అట్రాసిటీ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు బాగా పెరిగాయి. సుమారు 8వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరు వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అట్రాసిటీ కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ వాటిలలోనే షెడ్యూల్ ట్రైబల్ అట్రాసిటీ పెరిగాయి.
రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే
2023లో రాష్ట్రంలో సంభవించిన 7,760 రోడ్డు ప్రమాద మరణాల్లో 88.7శాతం మంది అతివేగంతోనే చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాలో 35మంది కంటే ఎక్కువ మంది ప్రమాదాల్లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2022లో 7,559తో పోలిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలు 1.33శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా నమోదైన 4,50,026 ప్రమాదాల్లో రాష్ట్రంలో దాదాపు 5 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.






