- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాకీ వసూలు కు వెళ్లిన ఏజెంట్‌పై పెంపుడు కుక్కను వదిలిన యజమాని
by Bhanu |
క్రెడిట్ కార్డు బాకీ వసూలు చేయడానికి వచ్చిన ఏజెంట్‌పై కుక్కను వదిలి దాడి చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, జూబ్లీహిల్స్ : క్రెడిట్ కార్డు బాకీ వసూలు చేయడానికి వచ్చిన ఏజెంట్‌పై కుక్కను వదిలి దాడి చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్ జవహర్‌నగర్‌కు చెందిన నందివర్ధన్ అనే వ్యక్తికి రెండు లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డు బాకీ ఉంది. ఈ బాకీ వసూలు చేయడానికి వచ్చిన ఏజెంట్ సత్యనారాయణపై నందివర్ధన్ అకస్మాత్తుగా తన పెంపుడు కుక్కను ఉసిగొల్పాడు. దీంతో ఆ కుక్క ఏజెంట్‌పై దాడి చేసి తీవ్రంగా కరిచింది. గాయాలైన సత్యనారాయణ వెంటనే మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






