- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రౌడీయిజంపై ఉక్కుపాదం - చార్మినార్ జోన్‌లో విస్తృత పోలీస్ తనిఖీలు
చార్మినార్ జోన్ పరిధిలో రౌడీషీటర్ల పై హైదరాబాద్ సిటీ పోలీసులు భారీ స్థాయిలో కాంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

దిశ, చంపాపేట్ : చార్మినార్ జోన్ పరిధిలో రౌడీషీటర్ల పై హైదరాబాద్ సిటీ పోలీసులు భారీ స్థాయిలో కాంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలు పరిరక్షించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ చార్మినార్ జోన్ కిరణ్ ఖరే ప్రబాకర్, ఐపీఎస్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది పాల్గొని, జోన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో, ఏసీపీలు పర్యవేక్షణలో రౌడీషీటర్ల నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ మిర్చౌక్ శ్యామ్ సుందర్, ఎస్‌హెచ్‌ఓ నెతాజీ, డీఐ నయీముద్దీన్‌తో పాటు ఎస్‌ఐలు, మహిళా సిబ్బంది కలిసి పలువురు రౌడీషీటర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఓమర్ ఖాన్, ఆరిఫ్ ఖాన్, గౌసిద్దీన్, కల్లియుద్దీన్, సయీదుద్దీన్, జాఫర్ హుస్సేన్ నివాసాలు ఉన్నాయి. అక్రమ ఆయుధాలు, గంజాయి వంటి మత్తుపదార్థాలు మరియు ఇతర నిషేధిత వస్తువుల కోసం గాలించినప్పటికీ, ఎలాంటి అక్రమ సామగ్రి లభించలేదని పోలీసులు తెలిపారు. డీసీపీ మీడియాతో మాట్లాడుతూ జోన్ పరిధిలో 90 మందికి పైగా రౌడీషీటర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించామని వెల్లడించారు. ప్రజల భద్రత కోసం ‘కార్డన్ అండ్ సెర్చ్’, ‘ఆపరేషన్ కవచ్’, వాహనాల విస్తృత తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు రౌడీయిజంపై “జీరో టాలరెన్స్” విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే ₹50,000 నుంచి ₹1,00,000 వరకు భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. రౌడీషీటర్ల పై ఆకస్మిక తనిఖీలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు పగలు, రాత్రి కొనసాగుతాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులతో సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.






