సైబర్ నేరాలపై పంజా విసిరేందుకు సీపీ సజ్జనార్ ప్రత్యేక కార్యక్రమం

by Malleboina Mahesh |

హైదరాబాద్‌ను సైబర్ సేఫ్ సిటీగా మార్చేందుకు నగరంలో ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింహం ఉండేలా సీపీ సజ్జనార్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

సైబర్ నేరాలపై పంజా విసిరేందుకు సీపీ సజ్జనార్ ప్రత్యేక కార్యక్రమం
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్‌ను సైబర్ సేఫ్ సిటీగా మార్చేందుకు నగరంలో ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింహం ఉండేలా సీపీ సజ్జనార్ (CP Sajjanar) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలను నియంత్రణ తో పాటు ప్రజల్లో అవగాహనను పెంచేందుకు వలంటీర్లను నియమించేందుకు సరికొత్త ప్రక్రియను ప్రారంభించారు. సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. దీని కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని వలంటీర్లుగా చేరే వారికి ‘సైబర్ సింబాలు’గా నామకరణం చేస్తున్నా రు. సైబర్ సింబాగా చేరిన వలంటీర్లకు జోనల్ సైబర్ సెల్ ద్వారా ఒక రోజు అవగాహన కల్పించి వారిని సైబర్ సిం బాలు గా మారుస్తారు. ఈ శిక్షణ పొందిన సైబర్ సింబా వాలంటీర్లు వారి ఇంటితో పాటు తెలిసిన వారందరికీ సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరిస్తారు.

హైదరాబాద్ సిటీలో లక్ష సైబర్ సింబా వలంటీర్లను తయారు చేసేలా సీపీ సజ్జనార్ పోలీస్ అధికారులతో కలిసి ఓ కార్యాచరణను రూపొందించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రచారం చేస్తున్నా ఇంకా సైబర్ క్రిమినల్స్ మాయ మాటలకు బోల్తా పడి ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. కాబట్టి ప్రతి గడపలో సైబర్ సింబా వాలంటీర్లు ఉంటే అవగాహన పెరిగి సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలు సురక్షితంగా ఉంటారని పోలీస్ ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెండు వారాల నుంచి పోలీసులు సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలను అలర్ట్ చేసేందుకు జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అవగాహన కల్పిస్తూనే సైబర్ సింబా వలంటీర్లు గా నమోదు చేస్తున్నారు. సైబర్ సింబా వలంటీర్‌గా నమోదుకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కూడా రూపొందించా రు. ఈ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి అం దులో వివరాలు నమోదు చేసుకుంటే పోలీస్ అధికారులు వాటిని నమోదు చేసుకొని వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ప్రారంభమైన రెండు వారాల్లోనే వెయ్యి మంది పౌరులు సైబర్ సింబా వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు.

Next Story