- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కల్లోలం
by D.Reddy |

X
దిశ, జూబ్లీహిల్స్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విలయతాండవం చేస్తోంది. తాజాగా.. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ వివరాల ప్రకారం.. స్వల్ప లక్షణాలతో చికిత్స చేయించుకోగా, 15 మంది డాక్టర్లకు, ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు ఐసోలేషన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి, తగు జాగ్రత్తలు తీసుకొని సేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ మెహబూబ్ ఖాన్ తెలిపారు.
Next Story