- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగర్ బస్తీలో 1100 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్..
హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంగర్ బస్తీలో పోలీసులు గురువారం తెల్లవారుజామున భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

దిశ, కార్వాన్: హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంగర్ బస్తీలో పోలీసులు గురువారం తెల్లవారుజామున భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ మెరుపు దాడి జరిగింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 1,100 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెల్లవారుజామున 3:30 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు బస్తీని దిగ్బంధించి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయిని, అనుమానాస్పద వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్తీలోకి ఎవరూ రాకుండా, లోపలి వారు బయటకు వెళ్లకుండా గట్టి బందోబస్తు మధ్య ఈ సోదాలు జరిగాయి. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.






