- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం... అనిల్ కుమార్ యాదవ్
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

దిశ, సికింద్రాబాద్ : రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్ నఫీజ్ ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆదం సంతోష్ కుమార్ అధ్యక్షతన తార్నాక,మెట్టుగూడ,అడ్డగుట్ట డివిజన్ల ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు వివరించాలని, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. అనంతరం అదం సంతోష్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మాజీ, రవి, గంటరాజు, అమర్నాథ్ గౌడ్, కిషోర్ యాదవ్, శిల్పా చారి, గుంటి కృష్ణ, రమేష్, హరి, పర్వేజ్, శేఖర్, శశాంక్, బెన్నా, నిస్సార్, బాబా, అశోక్, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.






