- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనాతన ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర కీలకం: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర అత్యంత కీలకమైందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.

దిశ, చైతన్యపురి: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర అత్యంత కీలకమైందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ్ ప్రెసిడెంట్ మంజుల ఆధ్వర్యంలో కొత్తపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అయన తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అయన మాట్లాడారు. వైశ్య సమాజ ఐక్యతకు, యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు ఐవిఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు
అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. సామూహిక లలితాదేవి పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, వాసవీమాత గోష్టి సేవ వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లోక క్షేమం కోసం ఈ కల్యాణం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో కక్కిరాల రమేష్, సుజన, గంజి రాజమౌళిగుప్త, ముస్తాల సత్తయ్య, పబ్బ చంద్రశేఖర్, కట్ట రవికుమార్ గుప్త, నారాయణ, కటకం శ్రీనివాస్, నరేశ్, ప్రవీణ్, నవీన్ బెల్లె రవికుమార్, బోనగిరి శ్రీనివాస్, చింతల రజవకాంత్, మణిమాల, నలిని, అర్చన, రాధిక పాల్గొన్నారు.






