- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసిన కలెక్టర్..
by Taduka Kalyani |
రాజీవ్ రహదారి స్టేట్ హైవే 01 ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించిన భూ నిర్వాసితులకు చెక్కులను అందచేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు.

X
దిశ, హైదరాబాద్ బ్యూరో: రాజీవ్ రహదారి స్టేట్ హైవే 01 ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించిన భూ నిర్వాసితులకు చెక్కులను అందచేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏడుగురు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ కింద సుమారు రూ 4.5 కోట్ల రూపాయల విలువగల చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హైవే లో భూములు కోల్పోతున్న వారికి ఈ చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కదిరవన్ పలని, డిఆర్ఓ నారాయణ, ఎల్. ఏ .ఓ ఎస్ హెచ్-01 అపర్ణ, కార్యాలయ సిబ్బంది, భూనిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






