Big Breaking News : HCU లో కుప్పకూలిన భవనం

by Muthe.Rajitha |   (  Updated:2025-02-27 17:18:16  IST  )

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Big Breaking News : HCU లో కుప్పకూలిన భవనం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది(Building Collapsed). గురువారం సాయంత్రం నిర్మాణంలోని అడ్మినిస్ట్రేషన్‌ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తక్షణమే స్పందించిన తోటి కార్మికులు, సిబ్బంది వారిని బయటికి లాగారు. కాగా వీరిలో ఒక కార్మికునికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కార్మికుణ్ణి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారెమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు వర్శిటీ అధికారులు తెలియజేశారు.

Next Story