- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
28న శిల్ప లే ఔట్ ఫేస్–2 ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లికి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లికి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో పాటు జోనల్, ప్రాజెక్ట్ ఇంజినీర్లతో కలిసి ఆయన శిల్ప లే ఔట్ ఫేస్–2 ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. రూ.182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన 1.20 కిలోమీటర్ల పొడవుగల ఆరు లైన్ల బై డైరెక్షన్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారని తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ శిలాఫలకం ప్రదేశంతో పాటు పబ్లిక్ మీటింగ్ వేదికను కూడా ఆయన పరిశీలించారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం వలన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయని, తిరిగి గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా కొండాపూర్ దిశగా సాఫీగా ప్రయాణించేందుకు ఇది ఉపకరిస్తుందని కమీషనర్ వెల్లడించారు. పరిశీలనలో జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ రావు, ప్రాజెక్టు సీఈ భాస్కర్ రెడ్డి, ఎస్ఈలు, డిప్యూటీ ఈఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.






