హుసేన్ సాగర్ వద్ద పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

by velandi.Saikiran |

హుసేన్ సారగ్ వద్ద వినాయక నిమజ్జనం జరుగుతున్న తీరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి

హుసేన్ సాగర్ వద్ద పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : హుసేన్ సారగ్ వద్ద వినాయక నిమజ్జనం జరుగుతున్న తీరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిమజ్జనం రోజున హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సామాన్యుని మాధిరిగా హుసేన్ సాగర్ తీరానికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. అక్కడ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరా తీశారు.

ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారు, ఇంకెన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు . అక్కడి నుండి పరిసరాలను పరిశీలిస్తూనే తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేధిక వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడి నుండి మాట్లాడాలని కోరినా ఆయన నిరకరించి గణపతిబప్పా మోరియా అంటూ కిందకు దిగారు. సుమారు అరగంట పాటు సీఎం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సీఎం వెంట కలెక్టర్ హరిచందన దాసరి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ రోహిన్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Next Story