సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని చీటింగ్.. బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామంటూ మోసం..

by Bhanu |

బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పుడుతున్న ముగ్గుర్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని చీటింగ్.. బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామంటూ మోసం..
X

దిశ, సిటీక్రైం : బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పుడుతున్న ముగ్గుర్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందంటూ బురిడి కొట్టించి అమాయకులను నిండా ముంచుతున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన జబ్బార్ ఖాన్ సోమాజీగూడ ప్రాంతంలో జెకే ఎంటర్ ప్రైజస్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అదే విధంగా బ్యాంక్ రుణాలను ఇప్పిస్తానని చెప్పి తన అనుచరులైన జావేద్ హాబీబ్ సాబ్ , సద్దాం హాబీబ్ సాబ్ లతో ప్రచారం చేసుకుంటున్నాడు. అతని దగ్గరకు వచ్చిన అమాయకుల ఇ:టి, స్థల పత్రాలను తీసుకుని ఆ తర్వాత మీ సిబిల్ స్కోర్ సరిగా లేదని మభ్య పెడతాడు. మీకు రుణం కావాలంటే ఇంటిని లేదా స్థలాన్ని తన అనుచరు లపైన రిజిస్టర్ చేస్తే వారి కేవైసీ ద్వారా రుణం తీసుకుంటానని నమ్మిస్తాడు. ఇలా రుణం తీసుకున్న తర్వాత జబ్బార్ ఖాన్ వాటి వాయిదాలను కట్టడు. దీంతో బ్యాంక్ అధికారులు రుణం తీసుకున్నందుకు ఆస్తులను జప్తు చేసేందుకు వచ్చినప్పుడు అమాయకులకు అసలు మోసం గురించి తెలుస్తుంది. ఇలా చాలా మందిని మోసం చేసిన ఫిర్యాదు ల పై సీసీఎస్ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు.

Next Story