- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Scarlet Fever : హైదరాబాద్ లో పెరుగుతున్న పిల్లల స్కార్లెట్ జ్వరం కేసులు
హైదరాబాద్ నగరంలో సీజనల్ వ్యాధులతో పాటు స్కార్లెట్ జ్వరం(Scarlet Fever) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో సీజనల్ వ్యాధులతో పాటు స్కార్లెట్ జ్వరం(Scarlet Fever) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఐదేండ్ల నుంచి 15 ఏండ్ల పిల్లలు ఈ జ్వరం బారిన పడుతున్నారని, ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి స్ట్రెప్టోకొక్కై బ్యాక్టీరియా(Streptococcus bacteria) వల్ల వచ్చే జ్వరాన్నే స్కార్లెట్ ఫీవర్ అని పిలుస్తారు. తీవ్ర జ్వరం, నోరు పొక్కిపోవడం, గొంతులో మంట, నాలుక ఎర్రగా కందిపోవడం(Strawberry tongue), నీరసం, ఏమీ తినాలనిపించకపోవడం వంటివి వ్యాధి లక్షణాలు అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి ఐదు రోజుల్లో బయటపడుతాయని డాక్టర్లు తెలిపారు. సరైన సమయంలో మంచి యాంటీ బయాటిక్ వాడితే ప్రమాదకరం కాదు. సరైన మెడిసిన్స్ తీసుకోకపోతే కొంతమందిలో గుండె, కిడ్నీల మీద ప్రభావం పడవచ్చు. రుమాటిక్ ఫీవర్, నెఫ్రైటిక్ సిండ్రోమ్‌లకు కూడా దారి తీయొచ్చు.
స్కార్లెట్ ఫీవర్ అనేది అంటువ్యాధి. ఈ జ్వరంతో బాధపడేవారు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆహారం, నీరు, ఇతర పదార్థాలను తీసుకోకూడదు. ముక్కు, నోరు కవరయ్యేలా మాస్కు ధరించడం ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు.






