- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ నుండి మధురనగర్ పోలీస్ స్టేషన్‌కి పరిధి మార్పు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను జూన్ 1

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను జూన్ 1 నుండి మధుర నగర్ పోలీస్ స్టేషన్ కి మార్చబడ్డాయి. యూసఫ్ గూడా బస్తి , ఎల్లన్ నగర్ , నవోదయ కాలనీ, కమలాపురి కాలనీ, శాలివాహన నగర్, గ్రీన్ బావర్చి , ప్రగతి నగర్ , మారుతి నగర్ , శ్రీ కృష్ణదేవరాయ నగర్ , సవేరా ఫంక్షన్ హాల్ , మహబూబ్ ఫంక్షన్ హాల్ , కృష్ణానగర్ ఏ బ్లాక్ , ఎస్బిహెచ్ కాలనీ పైన పేర్కొన్న ప్రాంతాలన్నీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి.
ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు తమ ప్రాంతంలో ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరిగిన మే 31 2025 వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదులు చేసేవారు. అయితే జీవో ఎంఎస్ నెంబర్ 57 , ఏప్రిల్ 24 , 2025 ప్రకారం సవరించి పైన పేర్కొన్న ఏరియాలని మధుర నగర్ పోలీస్ స్టేషన్ కు మార్చబడ్డాయి . కావున ఈ ప్రాంతాల నివాసితులు జూన్ 1 వ తేదీ నుంచి మధురానగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాల్సిందిగా ఇటు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి , మధురానగర్ ఇన్స్పెక్టర్ ఎన్ . ప్రభాకర్ ప్రజలకు పత్రికా ముఖంగా తెలియజేశారు.






