- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందానగర్‌లో చైన్ స్నాచింగ్.. 4 తులాల గొలుసు కొట్టేసిన దుండగులు
by Mallepaka Hamsa |
నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి 4 తులాల మంగళ సూత్రం అపహరించిన ఘటన చందానగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, మియాపూర్: నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి 4 తులాల మంగళ సూత్రం అపహరించిన ఘటన చందానగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామల (40) చందానగర్ పీజేఆర్ స్టేడియం సమీపంలో ఉంటున్నారు. కాగా శ్యామల షాపింగ్ నిమిత్తం ఆదివారం రాత్రి వెళ్లారు. తిరిగి వస్తూ కే ఎల్ ఎం మాల్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో పీజేఆర్ స్టేడియం వద్ద గుర్తు తెలియని అగంతకులు వెనక నుంచి బైక్ మీద వచ్చి నాలుగు తులాల మంగళ సూత్రాన్ని అపహరించుకు పారిపోయారు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






