- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై కారు దగ్ధం
హైదరాబాద్(Hyderabad)లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి(Cable Bridge)పై నేడు ఓ కారు దగ్ధం(Car Fire) అయింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి(Cable Bridge)పై నేడు ఓ కారు దగ్ధం(Car Fire) అయింది. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న హోండా సిటీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో కారులోని ప్రయాణికులు, సమీపంలోని వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న ఈ కారులో మంటలు రాగానే డ్రైవర్ అప్రమత్తతతో వెంటనే కారు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఈ ఘటన వల్ల కేబుల్ బ్రిడ్జ్ నుంచి రోడ్ నం. 45 వైపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. కారు పూర్తిగా దగ్ధమైనప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.






