ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద కారుకు మంటలు..

by Kodari Anjali |   (  Updated:2025-11-16 10:51:04  IST  )

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో కారుకు మంటలు జరిగిన ఘటన చోటుచేసుకుంది.

ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద కారుకు మంటలు..
X

దిశ, రాంనగర్: హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో కారుకు మంటలు జరిగిన ఘటన చోటుచేసుకుంది. TS TS09 GD 1262 నంబర్‌ గల ఎలక్ట్రిక్‌ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాంధీ నగర్ ట్రాఫిక్ పోలీసులు, దోమలగూడ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ నియంత్రించారు.

అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కేవలం వాహనానికి మాత్రమే నష్టం కలిగింది. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అదేవిధంగా ఇంద్ర పార్క్ బీసీ న్యాయ సాధన దీక్షకు సమావేశానికి వచ్చిన ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కొంకతి రాములు TS 25 T7488మరో కారు ఇదే కారు పక్కల పార్క్ చేసి ఉండటంతో తన కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. దీంతో ఈ కారు యజమాని బాధ బాధను వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరారు.

READ MORE .....

మంటల్లో కాలిపోయిన మరో EV కారు.. తప్పిన భారీ ప్రమాదం

Next Story